Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బంగ్లాదేశ్ జమాత్-ఇ-ఇస్లామీ పార్టీ అధినేతకు మరణశిక్ష

బంగ్లాదేశ్ కు చెందిన ప్రముఖ జమాత్-ఇ-ఇస్లామీ పార్టీ అధినేత మొతిర్ రెహమాన్ నిజామి (71)కు ఢాకాలోని ప్రత్యేక ట్రైబ్యునల్ మరణశిక్ష విధించింది. ఈ మేరకు ముగ్గురు జడ్జిల ధర్మాసనం ఆయనకు మరణశిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెల్లడించింది. 1971లో ఆ దేశ స్వాతంత్య్రోద్యమ సమయంలో పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలో వేలమంది చనిపోయారు. అందుకు జమాత్ అధినేతే కారణమంటూ పలు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఒకప్పటి ఆ దేశ మాజీ మంత్రి అయిన నిజామిపై మారణహోమం, హత్య, హింస, అత్యాచారం, ఆస్తి నాశనం వంటి పదహారు రకాల ఆరోపణలు మోపి విచారణ జరిపారు.

More Telugu News